BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 February 2026, 04:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పెగడపల్లిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

తెలంగాణ
16 Feb, 2026 - 04:56 AM
285 వీక్షణలు
పెగడపల్లిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా – భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు NTODAY NEWS: పెగడపల్లి, (గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెగడపల్లి మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ దర్శనానికి ముందు, స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు. మండల ప్రజలందరికీ శివుని ఆశీస్సులు కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.   #Mahashivaratri #Pegadapalli #RajarajeshwaraTemple #SpiritualEvent #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube