BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

సింగరేణి విశ్రాంత ఉద్యోగుల భారీ నిరసన ప్రదర్శన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
30 Mar, 2026 - 03:31 PM
227 వీక్షణలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా వద్ద సింగరేణి విశ్రాంత ఉద్యోగుల భారీ నిరసన ప్రదర్శన

న్యూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెన్షన్ పెంచాలని కోల్ పెన్షనర్స్ ధర్నాకు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం సంగిభావంగా , మద్దతుగా ధర్నా. 

 మంచిర్యాల: 30: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఆవరణలో కోల్ ఇండియా లోని బొగ్గు పెన్షన్లకు పెన్షన్ పెంపుదల చేయాలనే డిమాండ్ తో న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద కోల్ పెన్షనర్లు చేస్తున్న ధర్నాకు మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం. ఢిల్లీ లో వారు చేస్తున్న ధర్నా కు సంఘీభావం తెలుపుతూ మద్దతుగా ఈరోజు న నల్ల బ్యాడ్జ్ లు ధరించి ప్లే కార్డ్స్ చేత పూని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 1998 సంవత్సరం లో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి మూడు సవత్సరాలకు ఒకసారి మార్కెట్ లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని అగ్రిమెంట్ ఉన్న గత 28 సంవత్సరాల నుండి ఒక శాతం పెన్షన్ పెంచకపోవడం పట్ల తీవ్రంగా ఖండించారు. కరువు భత్యం తో కూడిన 50% శాతం కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసినారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ గా 15,000 వేలు చెల్లించాలని డిమాండ్ చేసినారు. 1998 పెన్షన్ ఒప్పందం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ స్కీం సవరించి పెన్షన్ పెంచాలని డిమాండ్ చేసినారు. అదే విధంగా CPMRS హెల్త్ కార్డు కు సంబంధించి 8 లక్షలకు బదులు 25 లక్షలు వైద్య సౌకర్యాలు కలిపించాలని డిమాండ్ చేసినారు. 2017 జనవరి నుండే పెరిగిన గ్రాడ్యుటీ సీలింగ్ 20 లక్షలు విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాలని కోరినారు. గోల్డెన్ అండ్ షేక్ హ్యాండ్ పెట్టుకున్న ఉద్యోగులకు ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చే ఆసరా పెన్షన్ కన్నా అతి తక్కువ 350-1000 రూపాయిల పెన్షన్ పొందుతున్న వారు వేలాది మంది ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వాలు , కోల్ ఇండియా యాజమాన్యం గుర్తించాలని పేర్కొన్నారు. అదే విధంగా అతి తక్కువ పెన్షన్ పొందుతున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు చెల్లించాలని , ఇల్లు లేని విశ్రాంత ఉద్యోగులకు డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని , అరుహులైన వారికి తెల్ల రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. అదే విధంగా సింగరేణి లో మారుపేర్లను మార్చాలని , నూతన అండర్గ్రౌండ్ బొగ్గు బావులను ప్రారంభించాలని , సింగరేణి లో మెడికల్ బోర్డు ను వెంటనే ప్రారంభించాలని , ఏరియా హాస్పిటల్ లో గతంలో మాదిరిగానే ఇన్ పేషెంట్ లకు ఉచితంగా వైద్య సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులైన సింగరేణి పెన్షనర్స్ మంచిర్యాల శ్రీరాంపూర్ మందమర్రి రామకృష్ణపూరి బెల్లంపల్లి ప్రాంతాల నుంచి వయోభారాన్ని లెక్కచేయకుండా పెన్షన్ పెంపుదాల కోసం అదేవిధంగా మిగతా సమస్యల పరిష్కారం కోసం అధిక సంఖ్యలో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. 

వయోభారం తో పాటు వృద్యాప్యం లో వచ్చే రోగాలకు వైద్య ఖర్చులు , మార్కెట్ లో పెరిగే ధరల వలన కనీస ప్రాథమిక అవసరాలకు కూడా మాకు వచ్చే పెన్షన్ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచినారు. ద్రవ్యోల్మానం 300 శాతం గణనీయంగా పెరిగినను కరువు భత్యం లేని పెన్షన్ సరిపోక దారిద్యం లోకి త్రోసి వేయడం వలన గౌరవప్రదమైన జీవితాలను గడుపుట కష్టపరంగా ఉందని సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసినారు.


ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్ల బండి రాజన్న, ఉపాధ్యక్షుడు పానగంటి పోషం , సలహాదారుడు మహేందర్ రాజు , మందమర్రి ఏరియా నాయకులు రామ్ రావేందర్ , ఆడెపు రాజేశం , రేణికుంట కొమురయ్య , బి రాజన్న , శ్రీరాంపూర్ నాయకుడు బింగి రాజేశం , గజెల్లి సుదర్శన్ , మేకల రమేష్ , బెల్లంపల్లి నాయకుడు శ్రీనివాస్ , రామకృష్ణాపూర్ ఏరియా నాయకుడు కాలువల నర్సయ్య, కార్యదర్శి అడిచర్ల రాజేశం , కేంద్ర కమిటీ నాయకులు రమేష్ Ex S&PC , మురహరి , నిచ్చకోళ్ల అంజన్న , పోతరాజుల చంద్రయ్య , రాంబాబు , గోపతి లక్ష్మణ్ , సర్వేశ్వర చారి , దేవులపల్లి రామస్వామి , రాజన్న గౌడ్ , భీంసేన్ , హనుమాండ్ల బుచ్చయ్య , విఘ్నేష్ , రాజ్ మొహమ్మద్ , చుక్క నారాయణ , కె దేవయ్య , ఎంఎస్ అలీ భేగ్, మంచాల రామయ్య , గుజ్జ శంకర్ , తదితరులు పాల్గొన్నారు.