BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 19 May 2026, 09:03 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 09:03 PM
151 వీక్షణలు

​మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 ​రైతుల ఆందోళనలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలి
​ పెద్దపల్లి మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వండి
​ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లాలని సూచన
​ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్
​మంచిర్యాల, మే 19 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో వేగంగా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి, రోడ్లపై ఎదురుచూస్తున్న రైతుల ఆందోళనలకు తావివ్వకుండా వారి కష్టాలను తీర్చాలని ఆయన ప్రజా ప్రభుత్వానికి సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని రైస్ మిల్లర్లకు ధాన్యం సేకరణపై తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
​ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి ఈ ధాన్యం సేకరణ సమస్యను తీసుకెళ్లాలని అధికారులను కోరారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నదాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎంపీ వంశీకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.