BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 11 April 2026, 08:01 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల జిల్లాలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 08:01 PM
208 వీక్షణలు

​మంచిర్యాల జిల్లాలో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన

మంచిర్యాల: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) (ఆదివారం, ఏప్రిల్ 12న) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ను పార్టీ శ్రేణులు విడుదల చేశాయి.

​పర్యటన వివరాలు ఇవే:

​ఉదయం 11:30 గంటలకు: గుడిపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల సందర్శన.

​మధ్యాహ్నం 12:00 గంటలకు: మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో టీ విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

​మధ్యాహ్నం 12:30 గంటలకు: జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కీలక సమావేశం. ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గానికి సన్మానం చేయనున్నారు.

​మధ్యాహ్నం 01:30 గంటలకు: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కుమార్తె వివాహ వేడుకకు హాజరై, ఎంఎన్ఆర్ (MNR) గార్డెన్స్‌లో నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.

​మధ్యాహ్నం 02:30 గంటలకు: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్క సుమన్ నివాసంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

​ఈ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేటీఆర్ రాక దృష్ట్యా జిల్లా పార్టీ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది