BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 March 2026, 03:29 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల కలెక్టరేట్‌ను ముట్టడించిన బీజేపీ

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Mar, 2026 - 03:29 PM
225 వీక్షణలు

మంచిర్యాల కలెక్టరేట్‌ను ముట్టడించిన బీజేపీ: ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్

బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ప్రజలను వంచించి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.