BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 22 May 2026, 01:11 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల నియోజకవర్గంలో 61 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 May, 2026 - 01:11 PM
172 వీక్షణలు

61 మంది లబ్ధిదారులకు రూ. 40.71 లక్షల సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణీ

మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఇది కొండంత అండగా నిలుస్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ. 40,71,400 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. వివిధ రకాల అనారోగ్యాలు, ఇతర ఆపత్కాలంలో ఉన్నవారికి ఉపశమనం కలిగించేందుకు ఉద్దేశించిన ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే ఈ నిధి ద్వారా అర్హులైన వారికి అండగా నిలుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల కష్టాలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు