BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 01:00 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాలలో విషాదం సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 01:00 PM
124 వీక్షణలు

​మంచిర్యాలలో విషాదం: సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఒక రెసిడెన్సీలో సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ అరిగెల సాయికిరణ్ గౌడ్ (30) ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్‌కు చెందిన సాయికిరణ్, సింగరేణిలో కాంట్రాక్ట్ పనులు చేస్తూనే మరోవైపు కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం సాగిస్తున్నారు; అయితే సాగు కోసం చేసిన రూ. 6 లక్షల అప్పు, అటు పంట దిగుబడి రాకపోవడం మరియు ఇటు కాంట్రాక్ట్ పనుల్లో ఎదురైన భారీ నష్టాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ నెల 9న బిల్లుల నిమిత్తం మంచిర్యాల జీఎం కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పి వచ్చిన ఆయన, ఒక హోటల్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటుండగా, మంగళవారం ఉదయం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ మధుసూదన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు