BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 02 July 2026, 07:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మోదీ మనోడేలే.. ఫోన్‌ కొట్టు!

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 07:33 AM
135 వీక్షణలు

ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాక ఆందోళన నెలకొన్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన స్నేహం మరోసారి చర్చనీయాంశమైంది.

భారత్-అమెరికా మిత్రమండలి సమావేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన ఓ ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. మియామిలో జరిగిన ఓ సమావేశం మధ్యలోనే ట్రంప్‌ ఒక్కసారిగా "మోదీకి ఫోన్‌ చేయండి" అని తన సిబ్బందిని ఆదేశించారట.

అప్పటికే భారత్‌లో ఉదయం ఆరు గంటలు మాత్రమే అయ్యాయని అధికారులు గుర్తు చేయగా, "పర్వాలేదు... మోదీ ఎప్పుడైనా మాట్లాడటానికి సిద్ధంగానే ఉంటారు" అని ట్రంప్‌ చెప్పినట్లు సెర్గియో గోర్ వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటగా, అంతర్జాతీయ వేదికలపై నరేంద్ర మోదీ-డొనాల్డ్ ట్రంప్ స్నేహబంధం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.