BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 22 June 2026, 07:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మటన్‌ను మించిన చింతచిగురు ధర.. కేజీ రూ.1000కు చేరిన ఆకుకూర!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 07:16 AM
178 వీక్షణలు

వర్షాకాలంలో విరివిగా లభించే చింతచిగురు ధరలు ఈ ఏడాది ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా రూ.400-500 మధ్య ఉండే కేజీ చింతచిగురు ధర కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.1000కు చేరడంతో వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో కేజీ రూ.1000 పలకగా, హైదరాబాద్ మార్కెట్లలో రూ.800 వరకు విక్రయిస్తున్నారు.

ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో చింత చెట్లకు కొత్త చిగురు తక్కువగా రావడం, మార్కెట్లలో సరఫరా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. మరోవైపు చింతచిగురుకు డిమాండ్ మాత్రం తగ్గకపోవడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

చింతచిగురు పప్పు, చింతచిగురు మటన్ కర్రీ, పచ్చడి వంటి వంటకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ప్రత్యేక రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా అధిక ధరలున్నా కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే చింతచిగురు రోగనిరోధక శక్తి పెంపు, జీర్ణక్రియ మెరుగుదల, రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం ధరలు సామాన్యుల జేబుకు భారంగా మారాయి.

వర్షాభావంతో పాటు చిగురు సేకరణ, కూలీ, రవాణా ఖర్చులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తే సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.