BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 31 May 2026, 07:10 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

మత్తు రహిత సమాజమే లక్ష్యం: పీలేరు. పుంగనూరు పరిధిలో 'డ్రగ్ డిటెక్షన్' కిట్లతో ముమ్మర తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 May, 2026 - 07:10 PM
142 వీక్షణలు

అన్నమయ్య జిల్లా  పుంగనూరు 

మదనపల్లి :  జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగదారులను గుర్తించేందుకు అధునాతన సాంకేతికతతో కూడిన డ్రగ్ డిటెక్షన్ కిట్లను వినియోగిస్తూ ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు చేపట్టారు.

పీలేరు, పుంగనూరు పరిధిలో గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన నిందితులు, అనుమానితులపై నిఘా ఉంచి శనివారం ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. పీలేరులో 8 మందికి, పుంగనూరులో 5 గురు అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు నెగిటివ్ అని తేలింది.

ప్రజలు తమ పరిసరాలలో మాదకద్రవ్యాల వినియోగం లేదా ఆక్రమ రవాణా గమనిస్తే వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.