BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 22 May 2026, 09:52 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
22 May, 2026 - 09:52 PM
140 వీక్షణలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలి--జిల్లా కలెక్టర్ ,ఎస్పీ 

ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రంలో టెంపుల్ సిటీ వద్ద వేద పాఠశాల శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాటు లు పకడ్బందీగా పూర్తి చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ,జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.పోలీస్ ,రెవెన్యూ శాఖ,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ,ఇ ఇ అర్ అండ్ బి ,ఎస్సీ ఇరిగేషన్, ట్రాన్స్ పోర్ట్,ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయితీ,ఈ ఈ పంచాయతీ రాజ్,వైద్య శాఖ, ట్రాన్స్ కో ,హార్టికల్చర్ డిపిఆర్ఓ,సివిల్ సప్లై , ట్రాఫిక్ తదితర శాఖల అధికారులు తమకి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.ఎస్పీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ వివిధ శాఖలు అధికారులు  సంపూర్ణ సమన్వయంతో  పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. టెంపుల్ సిటీ వద్ద హెలిప్యాడ్  అన్ని ఏర్పాట్లుచేయాలని ఆర్ అండ్ బి అధికారులను, భద్రత ఏర్పాట్లు,శాంతి భద్రతలు, పూర్తి స్థాయిలో  పోలీస్ బందోబస్తును,భారీ కేడింగ్  పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులను, అగ్నిమాపక పరికరాలను ,సేవలను అందుబాటులో ఉంచాలని అగ్నిమాపక శాఖను, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖను,రోడ్ల మరమ్మత్తుల పనులను అర్.అండ్.బి,అధికారులు ,శానిటేషన్ పనులను పూర్తి చేయాలని,మున్సిపాలిటీ,జిల్లా పంచాయితీ శాఖ,ఈ ఏర్పాట్ల ను పక్కాగా నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ,రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, పోలీస్ అధికారులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.