BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 06:03 pm
Posted by : V శ్రీనివాస్

​మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు

తెలంగాణ
/ మంచిర్యాల / క్యాతనపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 06:03 PM
141 వీక్షణలు

​మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు

​ఈ నెల 28న హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయ ధర్నాను జయప్రదం చేయండి

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే కార్మికులకు పండుగ సెలవులు ఇవ్వాలని, 60 ఏళ్లు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మరియు ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న హైదరాబాద్‌లోని సీడీఎంఏ (CDMA) కార్యాలయం వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాసర్ల రాజలింగుతో పాటు కార్మికులు దేవవరం, ఎల్లయ్య, రాజు, రవి, నారాయణ, రమేష్, తిరుపతి, పోశం, విష్ణు తదితరులు పాల్గొన్నారు