BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 January 2026, 08:18 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

తెలంగాణ
06 Jan, 2026 - 08:18 AM
319 వీక్షణలు

మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

NTODAY NEWS: గొల్లపల్లి మండల రిపోర్టర్ లక్ష్మణ్ అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలి: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో మరణించిన వారి ఓట్లను తొలగించాలని కోరారు. కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించామని తెలిపారు. వినతులను స్వీకరించినట్లు చెప్పారు. మరణించిన వారి ఓట్లు లేదా రెండు చోట్ల నమోదైన ఓట్ల సమాచారం అందితే తొలగిస్తామని పేర్కొన్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లు నాగరాజు, అయాస్, సమ్మయ్య, అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులు వై. సునీల్ రావు, నాంపల్లి శ్రీనివాస్ (బీజేపీ), చల్లా హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్ (బీఆర్ఎస్), మడుపు మోహన్ (కాంగ్రెస్), పైడిపల్లి రాజు (సీపీఐ), మిల్కూరి వాసుదేవ రెడ్డి (సీపీఐఎం), తేజ దీప్ రెడ్డి (ఏఐఎఫ్‌ఎఫ్‌బీ) తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube