BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

మంత్రి శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే

తెలంగాణ
23 Nov, 2025 - 06:23 AM
143 వీక్షణలు
మంత్రి శ్రీధర్ బాబుని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి NTODAY NEWS: ఎల్బీనగర్ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,  సచివాలయం నందు .దుద్దిల్ల శ్రీధర్ బాబు (సమాచార సాంకేతికత,ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లు,పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాలు.రంగా రెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ కోహెడకు అనంతరం బాటసింగారం తరలించి ఇక్కడి ప్రభుత్వ స్థలంలో టీమ్స్ పేరిట 28 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి .కేసీఆర్ భూమి పూజ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు నేను చొరవ తీసుకొని హాస్పిటల్ సమీపంలోనే వెయ్యి చదరపు గజాల స్థలంలో పోలీస్ స్టేషన్ కోసం కేటాయించలని కోరడంతో వారు సానుకూలంగా స్పందించి మంజూరు చేయడం జరిగింది. అలాగే హాస్పిటల్ కు అనుసంధానంగా ఠాణ బిల్డింగ్, పార్క్, విద్యుత్ సబ్ స్టేషన్ కోసం స్థలం కేటాయించారు. హాస్పిటల్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించడం జరిగింది అని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 14 అంతస్థులకు పరిమితి చేయడంతో పాటు పోలీస్ స్టేషన్, పార్క్, విద్యుత్ స్టేషన్ కోసం కేటాయించిన భూమి ఇచ్చే అవకాశం లేదని ఇవ్వలేమని తెలిసింది. భవిష్యత్ నందు మంచినీరు, విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే అట్టి భూమిలో మళ్ళీ యధాతధంగా నిర్మాణలు చేపట్టాలని సుధీర్ రెడ్డి మంత్రి ని కోరడం జరిగింది. అలాగే జీ.హెచ్.ఏం.సీ.ఆస్తిపన్ను అవకతవకలపై తక్షణ చర్య కోసం అభ్యర్థన చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది జీ.హెచ్.ఏం.సీ.క్షేత్ర స్థాయి సిబ్బంది మరియు పన్ను తనిఖీదారులు ఆస్తి పన్ను వసూలులో జరుగుతున్న కొన్ని తీవ్రమైన అవకతవకలను వారి దృష్టికి తీసుకోచ్చారు. కొందరు ప్రజలకు అనవసరమైన ఇబ్బందులను కలిగిస్తున్నారు అని వాటిని తక్షణమే పరిష్కరించాలి అని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా జీ.హెచ్.ఏం.సీ.సిబ్బంది గత మూడు సంవత్సరాలుగా ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేస్తున్నారని గమనించబడింది.చాలా సందర్భాలలో,అదనంగా రెండు సంవత్సరాల బకాయిలను నగదు రూపంలో డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా అవినీతికి అవకాశం ఉంది.మరియు సాధారణ కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోంది.ఇంక భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారిత పన్ను స్లాబ్ వర్గీకరణ మూడు వర్గాలుగా తప్పు అని నిరూపించబడుతోంది. ఈ వ్యత్యాసాల కారణంగా చాలా మంది నివాసితులకు తప్పు లేదా పెంచిన పన్ను నోటీసులు అందాయి. ప్రామాణిక విధానాన్ని అనుసరించి చట్టవిరుద్ధమైన డిమాండ్లతో భారం పడుతున్నారు. ఇది వ్యవస్థపై అపనమ్మకాన్ని సృష్టిస్తోంది.ఈ క్రమరహిత పద్ధతులు అనేక ప్రాంతాలలో విస్తృతమైన ఫిర్యాదులకు దారితీశాయి. కావున మీరు జోక్యం చేసుకొవలని కోరడం జరుగుతుంది అని అన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హాస్పిటల్ ప్రాంగణంలో రద్దు అయిన వాటి వివరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అలాగే జీ.హెచ్.ఏం.సీ.టాక్స్ విషయంలో అధికారులతో చర్చించి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.దానికి సుధీర్ రెడ్డి మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, తోట మహేష్ యాదవ్,చంద్రశేఖర్ రెడ్డి,టంగుటూరి నాగరాజు,జక్కిడి రఘువీర్ రెడ్డి, నాగలక్ష్మి, యాదగిరి ముదిరాజ్, జయశ్రీ, గట్టు శ్రీను, రమణారెడ్డి, వెంకటేష్, లక్ష్మణ్ చారి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube