BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 January 2026, 08:48 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం

తెలంగాణ
17 Jan, 2026 - 08:48 AM
257 వీక్షణలు

తొర్రూరు పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం

NTODAY NEWS: పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి రిపోర్టర్ వేణు తొర్రూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో తొర్రూరు మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొర్రూరు పట్టణ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో లోపాలు, తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మురుగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన పనులు, ప్రగతి వివరాలను తెలియజేయగా, పెండింగ్‌లో ఉన్న పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా తొర్రూరు పట్టణ అభివృద్ధికి అవసరమైన చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని, రానున్న రోజుల్లో పట్టణంలో మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. #Palkurthi #Thorrur #MunicipalReview #UrbanDevelopment #PublicInfrastructure #DrinkingWater #Sanitation #ElectricitySupply #PublicService #GovernmentReview #TelanganaDevelopment Follow us on Website Facebook Instagram YouTube