BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 28 April 2026, 02:10 pm
Posted by : V శ్రీనివాస్

MLC గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రో.కోదండరాం కి ఆత్మీయ సన్మానం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 02:10 PM
139 వీక్షణలు

MLC గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రో.కోదండరాం కి ఆత్మీయ సన్మానం చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు గజెల్లి వెంకటయ్య

​మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మల్సీగా నియమితులైన తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంని మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక మరియు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సోమవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో కోదండరాం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, హైదరాబాద్‌లో ఆయనను కలిసి శాలువాతో ఆత్మీయంగా సన్మానించారు.

​ఈ సందర్భంగా గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

​పోరాటాల ఫలితం: కోదండరాం నాయకత్వంలో సబ్బండ వర్గాలు చేసిన వీరోచిత పోరాటాలు, 1200 మంది అమరవీరుల త్యాగాల వల్లనే సీమాంధ్రుల దోపిడీ పాలన అంతమై తెలంగాణ సిద్ధించిందని కొనియాడారు.

​ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు: తెలంగాణ ఉద్యమ గొంతుకైన కోదండరాంకు ఎమ్మల్సీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉద్యమకారుల ఐక్య వేదిక మరియు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

​మంత్రి పదవి విజ్ఞప్తి: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం సేవలను గుర్తించి, ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

​ఉద్యమకారుల సంక్షేమం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను విస్మరించిందని, అందుకే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా కోదండరాం చొరవ చూపాలని ఆయన కోరారు.

​ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.