BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

దేశ సంపదను అమెరికాకు తాకట్టు పెడుతున్న మోడీ

తెలంగాణ
23 Feb, 2026 - 07:43 AM
160 వీక్షణలు
దేశ సంపదను అమెరికాకు తాకట్టు పెడుతున్న మోడీ NTODAY NEWS: వెల్లంకి, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా మతం పేరుతో ప్రజల మద్య వైషమ్యాలు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వంపై పోరాటం నడపాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్ వెల్లంకి గ్రామంలో ప్రారంభమైన సిపిఎం రాజకీయ శిక్షణా తరగతులు ప్రపంచ దోపిడీదారి అమెరికాకు భారత సంపదను నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతూ దేశ సార్వభౌమత్తాన్ని దెబ్బతీస్తుందని ఈ చర్యను దేశమేలు కోరే వారంతా ఐక్యంగా ప్రతిఘటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పిలుపునిచ్చారు. వెల్లంకి గ్రామంలో సిపిఎం మండల రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక రఘురామ ఫంక్షన్ హాల్ లో ఉత్సహ పూరితంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికంగా పార్టీ సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కూరెళ్ళ నరసింహ చారి అధ్యక్షతన జరిగిన రాజకీయ శిక్షణ తరగతులకు బోధకుడిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తుందన్నారు. అపార ఖనిజ సంపద చమురు నిల్వలు ఉన్న దేశాలను ఆక్రమించుకునేందుకు బహిరంగంగా ఆయా దేశ అధ్యక్షులను నిర్బంధిస్తూ అంతర్జాతీయ న్యాయ చట్టాలను తుంగలో తొక్కుతుందన్నారు. ఆయుధ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు దేశాల మధ్య యుద్ధాలను సృష్టించి యదేచ్చగా ఆయుధాలను సరఫరా చేస్తూ లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటుందన్నారు.ప్రపంచ దేశాల గమనాన్ని చిన్నా భిన్నం చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తూ యుద్దోన్మాదాన్ని సృష్టిస్తున్న అమెరికాకు విశ్వగురువు అని చెప్పుకునే భారత ప్రధాని ఈ దేశ సంపదను చీకటి ఒప్పందాలను కుదుర్చుకొని తాకట్టు పెడుతున్నారని అన్నారు. ఏప్స్టిన్ పైల్స్ లో మోడీ పేరు ఉన్నందున భయాందోళనతో పార్లమెంటులో కనీసం చర్చ కూడా పెట్టకుండా దేశీయ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేలా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టారన్నారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అంతర్జాతీయ, జాతీయ పరిణామాలను నిత్యం అవగాహన చేసుకొని ప్రజలను చైతన్యం చేసి పోరాటం చేయడంలో ముఖ్యపాత్ర వహించాలని పిలుపునిచ్చారు. కుల దురహంకారంతో చిన్నారిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో అదే స్థాయిలో కులం,మతం అస్తిత్వ వాదాలు ప్రజల మధ్య వైశాల్యాలను సృష్టిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్ అన్నారు. సిపిఎం మండల శిక్షణ తరగతుల్లో కులం,మతం అస్తిత్వవాదం పరిష్కార మార్గాలు అనే అంశంపై బోధిస్తూ అతిపెద్ద రాజ్యాంగం రాసుకున్న దేశంలో మతం,కులం పేరుతో దాడులు విశృంకలంగా సాగుతున్నాయని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో కులం పేరుతో పెత్తందారులు దేవుడి దర్శనానికి వెళ్లిన రజక వర్గానికి చెందిన కీర్తన కుటుంబంపై దాడి చేసి రెండు నెలల పాపని హత్య చేయడం జరిగిందని అసమానతల భారతానికి నిదర్శనం ఈ ఘటన అని అన్నారు. దోషులను వెంటనే శిక్షించాలని బాదిత కుటుంబానికి న్యాయం చేయాలని కులం పేరుతో జరిగే హత్యలపై పాలకవర్గాలు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు మేక అశోక్ రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్,బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహ చారి, బోయిని ఆనంద్, జంపాల అండాలు, కందుల హనుమంతు, కల్లూరి నగేష్,గ్రామ శాఖ కార్యదర్శి ఆవనగంటి నగేష్, గన్నేబోయిన విజయ భాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, బోడిగే రజిత, గొరిగే సోములు, వేముల సైదులు, తొలుపునూరి శ్రీనివాస్, ఎండీ రషీద్, వెల్లంకి గ్రామ నాయకులు కర్రె సంతోష్, ఆవనగంటి స్వామి,బర్ల బాబురావు,ఎర్రోళ్ళ నర్సింహా, తాటిపాముల సంతోష,తాటిపాముల మహేష్,కన్నెబోయిన రాజలింగం, తాటిపాముల వనిత, ఆవనగంటి వెంకటమ్మ, తాటిపాముల నవీన్, కరకంటి మల్లయ్య, పున్న దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.   Follow us on Website Facebook Instagram YouTube