BREAKING
గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు
www.ntodaynews.com

నాడు ఆరంభం అదుర్స్... నేడు విద్యార్థుల బెదుర్స్! మసకబారుతున్న నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:37 AM
31 వీక్షణలు

నాడు ఆరంభం అదుర్స్... నేడు విద్యార్థుల బెదుర్స్!  మసకబారుతున్న నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రతిష్ఠ

మంత్రి నియోజకవర్గంలో దిగజారుతున్న పరిస్థితులు.. మీడియా ప్రవేశంపై ఆంక్షలు చర్చనీయాంశం

నూజివీడు: ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శ ఉన్నత విద్యాసంస్థగా ప్రశంసలు అందుకున్న నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. పరిపాలనా లోపాలు, ఔట్‌సోర్సింగ్ నియామకాలపై ఆరోపణలు, విద్యార్థుల సంక్షేమంలో నిర్లక్ష్యం, మీడియాపై ఆంక్షలు వంటి పరిణామాలు సంస్థ ప్రతిష్ఠను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి మీడియా ప్రతినిధులను అనుమతించవద్దని ప్రధాన గేటు భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల సంస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వరుస కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ చర్యను మీడియా స్వేచ్ఛపై ఆంక్షగా పలు పాత్రికేయ సంఘాలు అభివర్ణిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పటికే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో రాజకీయ సిఫార్సులు, ఒత్తిడులు ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు అందించాల్సిన గుడ్లు, చికెన్ తదితర పోషకాహార సరఫరాలో లోపాలు ఉన్నప్పటికీ పూర్తి బిల్లులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య వైస్‌ ఛాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు మీడియా ప్రవేశంపై ఆంక్షలు విధించారనే సమాచారం మరింత వివాదానికి దారితీసింది. ప్రజాధనంతో నడిచే విద్యాసంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి అని జర్నలిస్టు సంఘాలు పేర్కొంటున్నాయి. మీడియాను అడ్డుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, వాటిని బహిరంగంగా వివరిస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు వైస్‌ ఛాన్సలర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో పరిపాలన విభాగంలోని ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ప్రచారం సాగుతోంది. సమాచారశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థలోనే మీడియాపై ఆంక్షలు విధించడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది.

అయితే, ఈ ఆరోపణలపై ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక వివరణ వెలువడలేదు. మీడియా ప్రవేశంపై తీసుకున్న నిర్ణయం, నియామకాలు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ఆరోపణలపై యాజమాన్యం స్పందన ఏమిటన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అధికారిక వివరణ వెలువడితే వాస్తవ పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.