BREAKING
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం!
www.ntodaynews.com

భువనగిరికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,​₹14.05 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 Jun, 2026 - 09:30 AM
70 వీక్షణలు

​తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  ఆ హోదాలో తొలిసారిగా మంగళవారం రోజున భువనగిరిలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణిల ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసింది.

​పర్యటనలోని ముఖ్య కార్యక్రమాలు:

​ టీజీ ఎస్పీడీసీఎల్ (TGSPDCL) యాదాద్రి భువనగిరి జిల్లా సర్కిల్ పరిధిలో, భువనగిరి పట్టణంలోని ఓంకార్ థియేటర్ పక్కన ₹5.83 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన సర్కిల్ కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.భూదాన్ పోచంపల్లి మండలం వంకమామిడి గ్రామంలో ₹2.67 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను కూడా ఈ సర్కిల్ కార్యాలయం నుంచే రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల సుమారు 1,279 మంది రైతులకు నాణ్యమైన విద్యుత్ అంది లబ్ధి చేకూరుతుంది.భువనగిరి మండలం హనుమపురం గ్రామంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఎదురుగా ₹2.03 కోట్లతో నిర్మించనున్న 'స్టోర్ కాంప్లెక్స్'కు, అలాగే వలిగొండ మండలం నర్సాపూర్ గ్రామంలో ₹3.52 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.​ఈ కార్యక్రమాల అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీజీ ఎస్పీడీసీఎల్ యాదాద్రి భువనగిరి సర్కిల్ ఎస్ఈ (SE) సురేష్ తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

​డిప్యూటీ సీఎం పర్యటనను పురస్కరించుకొని సోమవారం భువనగిరిలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేష్‌తో మాట్లాడి, కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి, పీసీసీ  డెలిగేట్ సభ్యులు తంగేళ్లపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.