BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నేడు విద్యాసంస్థల బంద్.. పలు విశ్వవిద్యాలయాల పరీక్షలు వాయిదా

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:33 AM
50 వీక్షణలు

నేడు విద్యాసంస్థల బంద్.. పలు విశ్వవిద్యాలయాల పరీక్షలు వాయిదా

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు నిరసనగా నేడు (జూలై 24) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఏ, ఏఐఎఫ్‌డీఎస్ తదితర విద్యార్థి, యువజన సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి.

నీట్ సహా జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే విద్యా వ్యవస్థ కేంద్రీకరణకు దారితీసే వీవీబీఎస్‌ఏ బిల్లును ఉపసంహరించుకోవాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరాయి.

బంద్ నేపథ్యంలో పలు ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలలు సెలవు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేందుకు విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

ఆందోళనల దృష్ట్యా ఉస్మానియా, జేఎన్‌టీయూ హైదరాబాద్, కాకతీయ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ విశ్వవిద్యాలయాలు నేడు జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేశాయి. కాకతీయ విశ్వవిద్యాలయం మరుసటి రోజు నిర్వహించాల్సిన కొన్ని పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త పరీక్ష తేదీలను ఆయా విశ్వవిద్యాలయాలు త్వరలో తమ అధికారిక వెబ్‌సైట్లలో వెల్లడించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారులు తెలిపారు.