BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 12 July 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
91 వీక్షణలు

నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఓ మహిళ మెడలోని మంగళసూత్రం, కమ్మలను లాక్కెళ్లి పరారయ్యారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను వెంటనే పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని, సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలను విశ్లేషించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ఘటన స్థల పరిశీలనలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, టౌన్-3 ఎస్సై హరిబాబు పాల్గొన్నారు.