BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 12 July 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పేకాట స్థావరంపై కోటపల్లి పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
102 వీక్షణలు

 మంచిర్యాల జిల్లా: కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12,640 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, జూలై 11న విశ్వసనీయ సమాచారం మేరకు ఆల్గాం గ్రామ శివారులోని ఎస్‌ఆర్‌ఆర్ ఫర్టిలైజర్ షాప్ వద్ద కొందరు డబ్బులు పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు దాడి చేయగా ఇద్దరు పరారయ్యారు. సంఘటనా స్థలంలో దుర్గం రామ్‌దేవ్, గట్టు తిరుపతి గౌడ్, గారె రాజలింగు, అల్లూరి అభిషేక్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పరారైన వారు గట్టు శ్రీనివాస్, రామ్‌టెంకి సునీల్‌గా గుర్తించారు.

స్వతంత్ర పంచుల సమక్షంలో నిందితుల వద్ద నుంచి రూ.12,640 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ దాడిలో ఎస్‌ఐ ఎస్. రాజశేఖర్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, కానిస్టేబుళ్లు శ్రావణ్, నరేష్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

పేకాట, జూదం, మాదకద్రవ్యాలు, గుడుంబా తయారీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇటువంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.