BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 12 July 2026, 06:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో రైతులకు ప్రత్యేక విద్యుత్ కోసం 'రైతు డిస్కం'కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 06:41 AM
109 వీక్షణలు

హైదరాబాద్: రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (TGRPDCL)కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ERC) లైసెన్స్ మంజూరు చేసింది.

అధికారుల ప్రకారం, రానున్న నాలుగు నెలల్లో ఈ కొత్త డిస్కం కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను నిర్వహించేలా ఈ సంస్థ పనిచేయనుంది.

రైతులకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత విద్యుత్ పథకం యథావిధిగా కొనసాగుతుందని విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కూడా వెల్లడించింది.

ఈ నిర్ణయంతో రైతులకు మరింత సమర్థవంతమైన విద్యుత్ సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.