BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 March 2026, 02:38 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

నిరుపేదల సొంతింటి కల నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బుగ్గారంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Mar, 2026 - 02:38 PM
123 వీక్షణలు

బుగ్గారం: నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం బుగ్గారం మండల కేంద్రంలో నక్క లక్ష్మి అనే లబ్ధిదారురాలికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి ఘనంగా ప్రారంభించారు.

​పేదల పక్షపాతి మన ప్రభుత్వం:

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. లబ్ధిదారురాలు నక్క లక్ష్మికి ఇల్లు పూర్తి కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మంజూరైన అన్ని ఇందిరమ్మ ఇళ్లను యుద్ధ ప్రాతిపదికన, త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

​ప్రభుత్వ పథకాలు ప్రతి నిరుపేద గడపకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.