BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 April 2026, 08:59 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
08 Apr, 2026 - 08:59 AM
547 వీక్షణలు

నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం--ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం మినీ మీటింగ్ హాల్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.ఇండ్ల నిర్మాణాల ప్రగతిని  విప్ బీర్ల ఐలయ్య  సమీక్షించారు.ఈ సందర్భంగా  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే స్లాబ్ లెవెల్ పూర్తి అయిన ఇండ్లకు గృహప్రవేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వంగపల్లి ప్రాంతంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు కరెంట్, రోడ్లు, మంచినీటి సౌకర్యాలు వంటి మౌలిక వసతులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడా మంచినీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి  పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇంకా పూరిగుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ శ్రీరాములు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.