BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 March 2026, 02:00 am
Posted by : యామనూరి మల్లికార్జున

నంద్యాల జిల్లా లో పోలీసుల కీలక విజయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 02:00 AM
158 వీక్షణలు

నంద్యాల జిల్లా లో పోలీసుల కీలక విజయం 

జిల్లాలో పోలీసులు కీలక విజయం సాధించారు.అంతర్రాష్ట్ర స్థాయిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అరెస్ట్ చేసి,భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..!!


ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడిని నంద్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రత్యేక నిఘా,టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి సుమారు 65 లక్షల రూపాయల విలువ చేసే 42 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు..!!

చెయిన్‌లు,హారాలు,ఉంగరాలు,గాజులు వంటి ఆభరణాలు ఇందులో ఉన్నాయి.ఈ దొంగతనాలకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి,మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు..!!

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశామని,స్వాధీనం చేసుకున్న ఆభరణాలను కోర్టు ప్రక్రియ అనంతరం యజమానులకు అప్పగిస్తామని తెలిపారు..

మొత్తానికి,నంద్యాల జిల్లా పోలీసుల వేగవంతమైన చర్యలతో అంతర్రాష్ట్ర దొంగతనాల కేసులో కీలక మలుపు తిరిగింది.ఇలాంటి ఘటనలపై పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు..