BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 07:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు ఎక్సైజ్ పరిధిలో మార్పు కార్యక్రమం విజయవంతం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 07:27 PM
153 వీక్షణలు

30 మందికి పునరావాసం – స్వయం ఉపాధి వైపు మలుపు

నూజివీడు, ఏప్రిల్ 2: నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన “మార్పు కార్యక్రమం” ఫలితంగా గతంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడిన 30 మందికి పునరావాసం కల్పించి, ఉపాధి అవకాశాలు అందజేశారు. దీంతో వారు అక్రమ కార్యకలాపాలకు దూరంగా వెళ్లి, క్రమబద్ధమైన జీవన విధానంలోకి అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. విన్నుత్న పాల్గొని లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. వారి జీవన విధానం, ఉపాధి పురోగతిని సమీక్షించి, ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గతంలో సారా అమ్మకం వంటి అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారు ప్రస్తుతం స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ మార్పుతో వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం కూడా పొందుతున్నారని పేర్కొన్నారు.

సబ్ కలెక్టర్ బి. విన్నుత్న మాట్లాడుతూ, “మార్పు కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తున్నాయి. లబ్ధిదారుల విజయాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిత, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.