BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 18 May 2026, 08:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 08:38 PM
184 వీక్షణలు

నూజివీడు జనసేన రాజకీయాల్లో మరోసారి బర్మా ఫణి బాబు పేరు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ కష్టకాలంలోనూ కేడర్‌తో పాటు నిలబడి పనిచేసిన ఫణి బాబుకు మళ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశాలపై జోరుగా చర్చ సాగుతోంది.

కూటమి ప్రభుత్వంలో మంత్రి కొలుసు పార్థసారధితో సమన్వయం కొనసాగిస్తూ, నూజివీడు నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పదవులు వంటి కీలక అవకాశాలను దక్కించడంలో బర్మా ఫణి బాబు కీలక పాత్ర పోషించారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో స్థానికంగా ఆయన ప్రభావం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు, కొంతమంది స్థానిక నాయకులు వ్యతిరేక ప్రచారం, సోషల్ మీడియా పోస్టులతో ఫణి బాబును టార్గెట్ చేస్తున్నప్పటికీ, అవి పార్టీ అధిష్టానం వద్ద పెద్దగా ప్రభావం చూపలేదని సమాచారం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకుడిగా ఆయనపై జనసేన పెద్దలు ఇప్పటికీ విశ్వాసం ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కేడర్‌లో కూడా “మళ్లీ ఫణి బాబుకే బాధ్యతలు” అన్న చర్చ ఊపందుకోవడంతో, నూజివీడు జనసేనలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.