BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 04:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడు: నవోదయం–2.0 కార్యక్రమం క్రింద నూతన చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 04:36 PM
172 వీక్షణలు

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ నాగ ప్రభు కుమార్, మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు, నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా పాత నేరస్తులపై చర్యలు తీసుకోబడ్డాయి.

ఈ కార్యక్రమంలో ముగ్గురు నేరస్తులు నూజివీడు తహసిల్దార్ వద్ద హాజరై బైండ్ ఓవర్ చేయబడినట్లు అధికారులు తెలిపారు.

బైండ్ ఓవర్ వివరాలు:

మిద్దె నరేంద్ర బాబు – తూర్పు దిగవల్లి గ్రామం, నూజివీడు మండలం

మూడు కృష్ణ – ఒగిరాలతండ గ్రామం, నూజివీడు మండలం

పెనుమెల కోటేశ్వర రావు – దేవరగుంట గ్రామం, నూజివీడు మండలం

హెచ్చరిక: ఈ బైండ్ ఓవర్ ఒక సంవత్సరం కాల పరిమితి కలిగి ఉంటుందని, ఈ కాలంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే రూ.1,00,000/- జరిమానా విధించబడుతుందని, అలాగే ప్రభుత్వ పథకాలు రద్దు చేయబడతాయని అధికారులు హెచ్చరించారు.

నాటు సారా పై చర్యలు: నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారు, నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సప్లై చేసే వ్యాపారులు, మరియు నాటు సారా తయారీకి బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానులపై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ మస్తానయ్య కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.