BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 09 June 2026, 09:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

న్యూస్‌పేపర్‌లో వేడి ఫుడ్ ప్యాకింగ్.. FSSAI హెచ్చరిక

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
110 వీక్షణలు

హైదరాబాద్, జూన్ 9: మనం రోజూ వీధి వ్యాపారుల దగ్గర నుండి తీసుకునే ఇడ్లీ, దోస, సమోసా, బజ్జీలు, లడ్డూ వంటి వేడి ఆహారాలను న్యూస్‌పేపర్‌లో చుట్టడం ఇప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరమని FSSAI హెచ్చరించింది. న్యూస్‌పేపర్‌లో ఉండే ప్రింట్ ఇంక్‌లో సీసం, టొల్యూన్ వంటి విషకరమైన రసాయనాలు ఉంటాయి. వేడి ఆహారం వాటిని కరిగించి ఫుడ్‌లోకి చేరుస్తుంది. పాత పేపర్లు ఈ.కోలై, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాకు వేదిక కావచ్చు. దీర్ఘకాలికంగా ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని FSSAI తెలిపింది. FSSAI సూచన: వేడి, నూనెతో కూడిన ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఫుడ్-గ్రేడ్ కాగితం, అల్యూమినియం ఫాయిల్, స్టీల్/గాజు డబ్బాలు మాత్రమే వాడాలి. వీధి వ్యాపారులు, హోటళ్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వీధి సమోసాలు, బజ్జీలు కొనుగోలు చేసేటప్పుడు న్యూస్‌పేపర్ ర్యాప్ ప్రింట్ భాగాన్ని తాకకుండా జాగ్రత్త వహించండి లేదా ఫుడ్-గ్రేడ్ పేపర్‌లో పెట్టించుకోండి.