BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 February 2026, 07:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

తెలంగాణ
24 Feb, 2026 - 07:54 AM
341 వీక్షణలు
చైత్ర మాస కుంభోత్సవం పురస్కరించుకుని అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున చైత్ర మాసంలో పౌర్ణమి అనంతరం అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 7న కుంభోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి. కుంభోత్సవం సందర్భంగా అమ్మవారికి సాత్త్విక బలి నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఇందులో భాగంగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు తదితర నైవేద్యాలను సమర్పిస్తారు. కుంభోత్సవ దినాన స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం (24-02-2026) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు. ముందుగా ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని అమ్మవారికి సమర్పించారు. #TempleRituals #Kumbhotsavam #ChaitraMasam #DevotionalNews #SpiritualTradition Follow us on Website Facebook Instagram YouTube