BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 30 July 2026, 08:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఒక అధికారికి ఒకే ప్రభుత్వ వాహనం.. కేంద్రం కీలక నిర్ణయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jul, 2026 - 08:25 PM
81 వీక్షణలు

ప్రభుత్వ నిధులు, వనరుల దుర్వినియోగాన్ని అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ప్రతి అధికారికి ఒకే ప్రభుత్వ వాహనం మాత్రమే కేటాయించాలని స్పష్టం చేసింది. ఒకే అధికారి పేరుతో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ వాహనాలు వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది.

సీనియర్ అధికారులు అయినా, అదనపు శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నా ఈ నిబంధనకు ఎలాంటి మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. అన్ని శాఖలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రభుత్వ వాహనాల వినియోగంపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించాలని సంబంధిత మంత్రిత్వ శాఖలకు సూచించింది.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు, వాహనాల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించడం, పరిపాలనలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.