BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 February 2026, 08:26 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అలంకరణ చేపల పెంపకంతో మహిళలకు ఆర్థిక సాధికారత

తెలంగాణ
06 Feb, 2026 - 08:26 AM
356 వీక్షణలు
అలంకరణ చేపల పెంపకంతో మహిళలకు ఆర్థిక సాధికారత కాకినాడలో కరీంనగర్ మహిళలకు ప్రత్యేక శిక్షణ పూర్తి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్  మహిళలు సంప్రదాయ ఉపాధి మార్గాలకే పరిమితం కాకుండా, వినూత్న రంగాలను ఎంచుకున్నప్పుడు మాత్రమే ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోగలరని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలోని ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు శుక్రవారం కలెక్టర్‌ను ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా శిక్షణలో భాగంగా తాము స్వయంగా తయారు చేసిన అక్వేరియంను కలెక్టర్‌కు అందజేశారు. శిక్షణలో ముఖ్య అంశాలు జిల్లాకు చెందిన 19 మంది మహిళలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా:- అలంకరణ చేపల రకాలు, వాటి సంతానోత్పత్తి విధానాలు చేపల పెంపకానికి అనువైన నీటి యాజమాన్యం, వాతావరణ పరిస్థితులు చేపల ఆహారం తయారీ, ప్యాకింగ్ విధానాలు అక్వేరియం తయారీ, అలంకరణ పద్ధతులు తక్కువ పోటీ.. మెరుగైన ఆదాయం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు పరిమిత రంగాలకే ఉపాధిగా మొగ్గుచూపడం వల్ల పోటీ పెరుగుతోందని, అలంకరణ చేపల పెంపకానికి మాత్రం మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ రంగంలో శిక్షణ పొందడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావచ్చని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విభిన్న రంగాల్లో మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ భారతి, ఫీల్డ్ ఆఫీసర్ అశోక్, ఎఫ్‌డీఓ మంజుల మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. #WomenEmpowerment #OrnamentalFishFarming #SelfEmployment #SkillDevelopment #FisheriesTraining #EconomicEmpowerment #Karimnagar #Kakinada #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube