BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

పాసిగాం పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థుల సందడి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
27 Mar, 2026 - 09:17 AM
122 వీక్షణలు

పాసిగాం పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థుల సందడి

ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు నిలయాలు

ఎమ్మార్వో శేఖర్

​ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడి.. ఉపాధ్యాయులకు ఘన సన్మానం

​వెల్గటూర్, మార్చి 27 :

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాసిగాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) వార్షికోత్సవ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల తహసిల్దార్ శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు కష్టపడి పని చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, దానికి నిదర్శనమే పాశిగామా పాఠశాల అని పేర్కొంటూ, చదువు ద్వారా దేనినైనా సాధించవచ్చునని ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు.

పాఠశాల ప్రాంగణం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో కిక్కిరిసిపోయింది. చిన్నారుల ఆటపాటలను చూసి తల్లిదండ్రులు, గ్రామస్తులు మురిసిపోయారు.

​గురువు-శిష్యుల బంధం వెలకట్టలేనిది: హెచ్‌ఎం

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం సంపత్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉండే బంధం వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు. సంపత్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పాఠశాల విద్యా ప్రమాణాలు, రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని గ్రామస్తులు ఈ సందర్భంగా కొనియాడారు.

​ప్రముఖులకు, ఉపాధ్యాయ బృందానికి సన్మానం

వేడుకల్లో భాగంగా పాఠశాల తరపున వెల్గటూర్ ఎమ్మార్వో, ఎస్ఐ, ఎంఈఓలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం హెడ్ మాస్టర్ సంపత్, ఉపాధ్యాయులు మహేష్, ప్రణీత,రజితలను తల్లిదండ్రులు సత్కరించారు. పాఠశాల కోసం నిరంతరం శ్రమిస్తున్న వంట మనిషి రామ్మక్క, ఆయా ప్రవళికలను కూడా ప్రత్యేకంగా సన్మానించి తమ కృతజ్ఞత చాటుకున్నారు.

​"ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడంలో ప్రధానోపాధ్యాయుల కృషి అభినందనీయం."

— స్థానిక ప్రజాప్రతినిధులు

​మెరుగైన విద్యతో విద్యార్థుల ఉత్సాహం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యాబోధన మెరుగుపడటంతో తమ పిల్లలు బడికి వెళ్లడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండలం తాసిల్దార్ శేఖర్, సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ , మండలం ఎం ఈ వో,ప్రభాకర్, వెల్గటూర్ మండలం ,  జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ నందయ్యగ్రామ సర్పంచ్ సోదరుడు కాండ్రపు మహేష్, ఉప సర్పంచ్ భూమయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.