BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 22 May 2026, 07:30 pm
Posted by : కూనురు మధు

పెద్దకాపర్తిలో టీబీ క్యాంప్ ప్రారంభించిన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం NTODAY NEWS చిట్యాల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
22 May, 2026 - 07:30 PM
301 వీక్షణలు

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత టీబీ  వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పిలుపునిచ్చారు. శుక్రవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీబీ హెల్త్ క్యాంప్‌ను కాట వెంకటేశం అధికారికంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన టీబీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ హెల్త్ క్యాంప్‌లో భాగంగా గ్రామానికి చెందిన సుమారు వంద మందికి టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో నలుగురికి టీబీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. బాధితులకు వెంటనే వైద్య సిబ్బంది సమక్షంలో అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొంగోని చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, హెల్త్ సిబ్బంది చిత్తలూరు శ్రీను, అండాలు, ఏఎన్ఎంలు, తదితరు పాల్గొన్నారు.