BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 06 August 2026, 09:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ప్రజా గాయకుడు గద్దర్‌కు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 09:23 PM
91 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను, ఆగస్టు 6: పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు, కవి, ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన గద్దర్ మూడో వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో శిరిడి సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు యజ్ఞకృష్ణ మాట్లాడుతూ, గద్దర్ పేదలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఎదుర్కొనే కష్టనష్టాలను తన పాటల ద్వారా ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించి సామాజిక చైతన్యం తీసుకొచ్చారని అన్నారు.

"నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ", "బండెన్న బండిగట్టి", "అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా" వంటి గద్దర్ రచించిన పాటలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయని తెలిపారు. జీవిత చివరి దశలో తాను నమ్మిన కమ్యూనిజం, మావోయిజం భావజాలం నుంచి వైదొలిగి, అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని స్వీకరించిన మానవతావాదిగా గద్దర్ నిలిచారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అంగన్వాడీ చిన్నారులు, సిబ్బంది పాల్గొని గద్దర్‌కు ఘనంగా నివాళులర్పించారు.