BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 31 May 2026, 09:28 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
31 May, 2026 - 09:28 PM
72 వీక్షణలు

ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో జిల్లా ఎల్లప్పుడూ ఉత్తమ పనితీరుతో మెరుగైన స్థానంలో నిలవాలి

వెనుకబడిన పల్నాడు జిల్లాను కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానంలో నిలుపుదామని, జిల్లా ప్రగతే మనందరి ప్రధాన లక్ష్యం కావాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలన్నింటిలో పల్నాడు జిల్లా పనితీరు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

సీనియర్ నాయకులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన జిల్లా అభివృద్ధి కార్యాచరణ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ‘సర్’ విధివిధానాలు, వైసీపీ దుష్ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించారు. సీనియర్ నాయకుడిగా ప్రత్తిపాటి పుల్లారావు పలు సూచనలు, సలహాలు అందించారు.