BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 June 2026, 10:12 pm
Posted by : కూనురు మధు

పంతంగి టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
06 Jun, 2026 - 10:12 PM
186 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మహిళ ప్రాణాలు కోల్పోయింది. చౌటుప్పల్ మండలం పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం (జూన్ 06) వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు, ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. కారు చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అతివేగంగా వచ్చి కారును బలంగా ఢీకొట్టింది. బస్సు వేగానికి కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ప్రయాణిస్తున్న మహిళ తీవ్రమైన గాయాలవడంతో అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం అత్యవసరంగా చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.