BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 16 May 2026, 09:34 pm
Posted by : కూనురు మధు

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
16 May, 2026 - 09:34 PM
484 వీక్షణలు

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత NTODAY NEWS చౌటుప్పల్

431 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, మరో ఇద్దరు పరార్

రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (ఆర్‌ఎన్‌పీఎస్) బృందం, చౌటుప్పల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పంతంగి టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న TS07GM 4617 నంబర్‌ (నకిలీ నంబర్ ప్లేట్) గల మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో సుమారు 431 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 5 కిలోల చొప్పున 83 ప్యాకెట్లు, 2 కిలోల చొప్పున 8 ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని, రాజమండ్రి ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న నిందితులు సలీమ్ (34), అమన్ (22)గా గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా లిషాడి గ్రామానికి చెందినవారని తెలిపారు. కేసులో అమీర్ుద్దీన్, ఫిరోజ్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
చౌటుప్పల్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.