www.ntodaynews.com
పోలీసు జాగిలం రాజా కన్నుమూత...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పోలీసు జాగిలం 'రాజా' కన్నుమూత...
తేదీ:06.08.2026
అన్నమయ్య జిల్లా
రాయచోటి, ఆగస్టు 06: వీఐపీ బందోబస్తు, పేలుడు పదార్థాల గుర్తింపులో విశేష సేవలందించిన అన్నమయ్య జిల్లా పోలీసు జాగిలం 'రాజా' (ల్యాబ్రడార్) అనారోగ్యంతో గురువారం కన్నుమూసింది. రాయచోటిలోని పాత పోలీసు క్వార్టర్స్ లో రాజా పార్థివ దేహానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. పూలమాల వేసి నివాళులర్పించి, పోలీస్ శాఖకు రాజా అందించిన సేవలను కొనియాడారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, సీఐలు చలపతి, రోషన్, కృష్ణంరాజు నాయక్, చాంద్ బాషా, ఆర్ఐ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఎస్ఐ లు, డాగ్ స్క్వాడ్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని రాజాకు కడసారి వీడ్కోలు పలికారు.