BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 10:13 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

పరీక్ష నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
18 Mar, 2026 - 10:13 AM
228 వీక్షణలు

పరీక్ష నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దు --యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

జిల్లాలో పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవతరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.విద్యార్థుల హాజరు,గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు.విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి పంపించాలనిచెప్పారు.ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల డిపాజిట్ ను పోలీస్ భద్రతతో  డిపాజిట్ చేయాలని ఆదేశించారు.పరీక్ష కేంద్రాలవద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని,పరీక్ష కేంద్రంలోకి ఇతర వ్యక్తులను వెళ్లకుండా చూడాలని అన్నారు.పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జీరాక్స్ కేంద్రాలు మూసివేసేలా చూసుకోవాలన్నారు.జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగరాదని,పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని చెప్పారు.ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.