BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 07:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 87 ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:39 PM
143 వీక్షణలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 87 ఫిర్యాదులు

విజయవాడ, మార్చి 23: ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో 87 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఇన్‌చార్జ్ పోలీస్ కమిషనర్ సర్వ శ్రేష్ఠ త్రిపాటి, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ ఎ.బి.టి.ఎస్. ఉదయారాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు, వారితో నేరుగా మాట్లాడి సమస్యలపై అవగాహన పొందారు. భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి అత్యధికంగా నమోదయ్యాయి. మహిళా సంబంధిత కేసులు, కుటుంబ కలహాలు, మోసాలు, దొంగతనాలు, కొట్లాటలు వంటి వివిధ అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి.

ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత విభాగాల అధికారులకు సూచనలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.