BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 06:20 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 06:20 AM
220 వీక్షణలు

కరీంనగర్: ప్రజావాణికి వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడేతో కలిసి ఆమె ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుండి ఆశతో వచ్చే బాధితులకు అధికారులు అండగా నిలవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఓపికగా విన్న కలెక్టర్, వెంటనే పరిష్కారమయ్యే అంశాలపై అక్కడికక్కడే అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వృద్ధులు, దివ్యాంగుల చెంతకే కలెక్టర్:

మానవీయ కోణంలో ఆలోచిస్తూ, కలెక్టర్ చిత్రా మిశ్రా స్వయంగా వృద్ధులు మరియు దివ్యాంగుల వద్దకు వెళ్లి దరఖాస్తులను స్వీకరించడం అందరినీ ఆకట్టుకుంది. నేటి ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తం 290 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.