BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

నర్రా రాఘవరెడ్డి బాటలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
09 Apr, 2026 - 07:21 PM
307 వీక్షణలు

ప్రజల మనిషి నర్రా రాఘవరెడ్డి బాటలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి NTODAY NEWS చిట్యాల 

నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా, ప్రజలకు నిస్వార్థ సేవలందించిన ప్రజా నాయకుడు కా, నర్రా రాఘవరెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిపిన అమరజీవి కా, నర్రా రాఘవరెడ్డి పదకొండవ వర్థంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.నిరంతరం ప్రజల మధ్య ఉంటూ,ప్రజల పక్షపాతిగా అసెంబ్లీలో తమ వాణి పాలకులకు వినిపించిన రాఘవరెడ్డి లాంటి నాయకులు కరువైనారని ఆవేదన వ్యక్తం చేశారు.నల్లగొండ జిల్లా సాగు తాగునీటి కోసం పట్టుబట్టి యస్ యల్ బి సి నీటిని రప్పించిన ఘనత సిపిఎం శాసన సభ్యులకు, నర్రా రాఘవరెడ్డి కి ఉందని చెప్పారు.ఆరు పర్యాయాలు నకిరేకల్ ఎమ్మెల్యే గా, సిపిఎం శాసన సభా పక్ష నాయకుడిగా పనిచేసి, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో మెప్పించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాఘవరెడ్డి సేవలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు మరువలేనివని కొనియాడారు.రాఘవరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేయడమే కమ్యూనిస్టు కార్యకర్తల ముఖ్య కర్తవ్యం అని అన్నారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ గా, సమితి ప్రెసిడెంట్ తోపాటు సుదీర్ఘ కాలం నకిరేకల్ ఎమ్మెల్యే గా పని చేసి, రైతు, కూలీల సమస్యలే కాకుండా కల్లు గీత,, గొర్రెల మేకల పెంపకం దారుల,గ్రామ సేవకుల హక్కుల కోసం పని చేసి, కొత్త జీ.వో లను సాధించారని అన్నారు.ప్రజా నాట్య మండలి కళాకారుడిగా పల్లె సుద్దులు చెప్పి,పాలక పక్షాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసిన ప్రజల మనిషి నర్రా రాఘవరెడ్డి అని చెప్పారు.నకిరేకల్ నియోజకవర్గం తోపాటు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసి, మాతో పనిచేయించిన నర్రా రాఘవరెడ్డి జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయం అని అన్నారు.ముందుగా రాఘవరెడ్డి విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జెండాను జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు.పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,నారీ ఐలయ్య, జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య,జిట్ట సరోజ,మల్లం మహేష్,పెంజర్ల సైదులు, చింతపల్లి బయ్యన్న, మండల పార్టీ నాయకులు రాచకొండ శ్యాం సుందర్, శీలా రాజయ్య, అరూరి శ్రీను,ఐతరాజు నర్సింహా, యాదయ్య, కల్లూరి కుమార స్వామి, మెట్టు నర్సింహా, పంది నరేష్, జిట్ట స్వామి,అక్కెనపల్లి నాగయ్య వివిధ ప్రజా సంఘాల నాయకులు నర్రా కిశోర్,పాలమాకుల అర్జున్, చింతపల్లి క్రిష్ణయ్య, బూరుగు విజయ్, శ్రీను, నర్రా శేఖర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రమేష్, బాబురావు,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.