BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 31 May 2026, 09:22 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
31 May, 2026 - 09:22 PM
85 వీక్షణలు

చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమర్రు సమీప జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ఎర్టికా కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలాల కాలువలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదానికి గురైన యువకులంతా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా బాపట్ల జిల్లా చీరాల బీచ్‌కు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.