BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 06 August 2026, 11:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పుట్టినరోజు వేళ గురుకుల విద్యార్థినిని బయటకు పంపించారంటూ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 11:12 PM
81 వీక్షణలు

ద్వారకాతిరుమల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తీరుపై తల్లి ఆవేదన.. విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్

ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల, ఆగస్టు 6: ద్వారకాతిరుమలలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినికి సంబంధించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు పాఠశాలకు వచ్చిన తల్లి, కుటుంబ సభ్యులను లోపలికి అనుమతించలేదని వారు ఆరోపించారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, పుట్టినరోజు సందర్భంగా కేక్, కొత్త బట్టలు తీసుకుని పాఠశాలకు వచ్చినప్పటికీ ప్రిన్సిపాల్ వారిని గేటు దాటనివ్వలేదని తెలిపారు. దీంతో వారు రోజంతా పాఠశాల గేటు వద్దే వేచి ఉన్నారని చెప్పారు.

సాయంత్రం సమయంలో విద్యార్థినిని పాఠశాల నుంచి బయటకు పంపించారని, అనంతరం స్వగ్రామమైన చింతలపూడికి వెళ్లేందుకు ద్వారకాతిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పటికీ వెంటనే బస్సు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.

పుట్టినరోజు కోసం తీసుకొచ్చిన కేక్, కొత్త బట్టలు చూపిస్తూ విద్యార్థిని తల్లి కన్నీటి పర్యంతమై తన కుమార్తెతో ఇలా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత ప్రిన్సిపాల్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.

ఈ ఘటనను గమనించిన బస్టాండ్‌లోని పలువురు స్థానికులు కూడా విషయాన్ని సమగ్రంగా విచారించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.