ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ
తెలంగాణ
లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ
NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
రోడ్డు పనులను పరిశీలించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజన్న
సుండిపెంట, ఫిబ్రవరి 28, 2026: సుండిపెంట గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజన్న స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది లబ్ధిదారులు వినతిపత్రాలు అందజేయగా, వాటి పరిష్కారానికి సంబంధిత మార్గాలను సూచించారు.
అనంతరం వెస్ట్రన్ కాలనీలోని ఎన్టీఆర్ విగ్రహం రోడ్డు పనులు, అంబేద్కర్ సెంటర్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో మురుగు నీరు, వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త యుగంధర్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఉండవెల్లి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు గెల్లి వెంకటేశ్వర్లు, సోమిశెట్టి సత్యమల్లికార్జున, జనసేన నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
#Srisailam #BuddaRajanna #PensionDistribution #Sundipenta #RoadWorks #AndhraPradeshNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube