BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 June 2025, 08:00 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భూభారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం

తెలంగాణ
12 Jun, 2025 - 08:00 AM
314 వీక్షణలు
భూభారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం--యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి NTODAY NEWS: బొమ్మలరామారం, జూన్ 12 భూ సమస్యలు ఉన్నవారు గ్రామ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకుంటే భూ భారతి చట్టం ద్వారా భూ శాశ్వత పరిష్కారం అవుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం రోజున రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ధరణి ద్వారా కానీ భూ సమస్యలకు ప్రభుత్వం కొత్తగా భూభారతి (ఆర్ ఓ ఆర్ చట్టం) అమలులో భాగంగా రెవిన్యూ అధికారులే మీ గ్రామానికి వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారు.గ్రామంలోని రైతులను వారి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ మార్పులు చేర్పులు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ గ్రామంలోనే మీ ఇంటి దగ్గరకే వచ్చి రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరిస్తారన్నారు. భూ భారతి లో దరఖాస్తు పెట్టుకుంటే ,రైతులు అర్జీతోపాటు పాస్ పుస్తకం,సమస్యలకు సంబంధించిన ఆధారాలను అధికారులకు అందజేయాలని,అందజేసిన రోజే రెవెన్యూ అధికారులు మీ గ్రామంలోనే పరిశీలించి ,కోర్టు పరిధిలో ఉన్న ఆర్జీల మినహా మిగతా వాటిని పరిష్కరిస్తారన్నారు. సమస్య యొక్క దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. తీసుకున్న అర్జీలను అదే రోజు గ్రామంలో పరిశీలించి అవసరం అయితే క్షేత్రస్థాయిలో విచారిస్తారన్నారు. భూ భారతి సేవలు గ్రామంలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సదస్సులలో తాసిల్దార్ పి శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి, ఏ ఆర్ ఐ నరేష్ నాయక్, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube