BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 18 May 2026, 10:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 10:50 PM
258 వీక్షణలు

కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఎస్‌బీకే విజ్ఞాన భవనంలో నిర్వహించిన కామ్రేడ్ పర్చూరి సోమేశ్వరరావు 26వ వర్ధంతి సభలో డి హరినాథ్ కీలక ప్రసంగం చేశారు. 17 సంవత్సరాల పాటు సర్పంచిగా సేవలందించిన కామ్రేడ్ సోమేశ్వరరావు నిజాయితీకి ప్రతీకగా నిలిచిన మచ్చలేని నాయకుడని కొనియాడారు. దివిసిపిఐ ఎంఎల్ నేత కామ్రేడ్ షనకాబుచ్చి కోటయ్య సహచరుడిగా సోమేశ్వరరావు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తుచేశారు.

దేశంలో మతోన్మాద, ఫాసిస్ట్ శక్తులకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు దాసోహం అవుతున్నాయని హరినాథ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ కూడా బీజేపీ భజన చేస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు ద్వితీయ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

ఉద్యమ చరిత్ర కలిగిన అమరవీరుల స్ఫూర్తితో ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని విమర్శించారు. ఒకరు ఓటుకు నోటు కేసులో, మరొకరు ఈడీ కేసుల్లో చిక్కుకుని బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జనసేన పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరైందని హరినాథ్ వ్యాఖ్యానించారు. యువత రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తోందని, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, తమిళనాడు ప్రాంతాల్లో మార్పును కోరే కొత్త నాయకత్వం ముందుకు వస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమానికి పరుచూరి రాఘవేంద్రరావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం ఈశ్వర్, బండారు వెంకటేశ్వరరావు, పెరికే కాంతారావు తదితరులు పాల్గొన్నారు.