BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 February 2026, 01:51 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ
19 Feb, 2026 - 01:51 PM
270 వీక్షణలు
దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్–2026కు సన్నాహాలు వేగవంతం NTODAY NEWS: చిట్యాల తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్–2026” దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్‌ను చిట్యాల మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 21, 22 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సైదా నాయక్, తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు కుంకుడాల గోవర్ధన్ మాట్లాడుతూ సాహిత్యం సమాజ మార్పుకు మార్గదర్శకమని పేర్కొన్నారు. లిటరరీ ఫెస్ట్‌లో కవిత్వం, కథ, నవల, విమర్శలపై విశ్లేషణలతో పాటు మహిళా, యువ సాహిత్యంపై ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, ఫోటో ప్రదర్శనలు, పుస్తక ప్రదర్శనలు, పాటలు, నాటక ప్రదర్శనలు ఉత్సవాల ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయని వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ మరియు పీజీ కళాశాలల విద్యార్థులకు “డ్రగ్స్ రహిత సమాజం – సుస్థిర భవిష్యత్తు” అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులను హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాల్లో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని సీనియర్ కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ప్రమోద సాహితీ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, ప్రధానోపాధ్యాయులు అంబటి సత్తయ్య, బాదం బిక్షపతి, కరుణాకర్, వెంకటేశ్వర్లు, జాన్ వరలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు. #TelanganaSahithi #LiteraryFest2026 #HyderabadEvents #TeluguLiterature #SahityaUtsavalu #YouthWriters #CulturalEvents Follow us on Website Facebook Instagram YouTube